Presenting a 'special' weekly song (along with lyrics) from our collection for you all to enjoy on demand.
Mounamgaane Edhagamani... |
|
Movie: Naa Autograph
Singers: Chitra Lyrics: Chandrabose Music: Keeravani |
Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.
|
Toggle English/Telugu
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందనీ, దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందనీ, బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ కష్టాల వారధి దాటినా వారికి సొంతమౌతుంది తెలుసుకుంటే సత్యమిదీ, తలచుకుంటే సాధ్యమిదీ మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా, నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా, చేతిగీత మార్చుకో మారిపోని కధలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
mounamgaane yedagamanee mokka neeku chebutundi
yedigina koddi odhagamani arthamandulo undhi mounamgaane yedagamanee mokka neeku chebutundi yedigina koddi odhagamani arthamandulo undhi apajayaalu kaligina chote gelupu pilupu vinipistundi aakulanni raalina chote kottha chiguru kanipistundi dooramento undhani digulu padaku nestamaa dariki cherchu daarulu kooda unnaayigaa bhaaramentho undhani baadhapadaku nestamaa baadha venta navvula panta untundiga saagara madhanam modalavagane vishame vachhindi visuge chendaka krushi chestene amrutamichhindi avarodhala deevullo aananda nidhi unnadi kashtaala vaaradhi daatina vaariki sontamoutundi telusukunte satyamidi, talachukunte sadhyamidi mounamgaane yedagamanee mokka neeku chebutundi yedigina koddi odagamani arthamandulo undi chemata neeru chindagaa nuduti raata maarchuko maarchalenidedi ledani gurtunchukoo pidikile biginchaga cheetigeeta maarchuko maaripooni kadhale leevani gamaninchuko toochinattuga andari raatalu bramhe raastaadu nachhinattugaa nee talaraatanu nuvvee raayali maa dhairyaanni darshinchi daivaale taladinchagaa maa dhairyaanni darshinchi daivaale taladinchagaa maa sankalpaaniki a vidhi saitam cheetulettali anthuleni charitalaki adi nuvvu kavali mounamgaane yedagamanee mokka neeku chebutundi yedigina koddi odagamani arthamandulo undi apajayaalu kaligina chotae gelupu pilupu vinipistundi aakulanni ralina chote kotta chiguru kanipistundi |
Comments